అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా.. ట్రంప్ గారి తీరుపై మండిపడ్డారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందు స్థానంలో ఉన్న ట్రంప్ ప్రచార తీరుపై ఆమె ధ్వజమెత్తారు. న్యూయార్క్ సిటీ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇలా మాట్లాడారు.
"ప్రచారంలో కొందరు(ట్రంప్) విపరీత పంథాల్ని అనుసరిస్తున్నారు. అమెరికాలో అనేక జాతుల ప్రజలు ఉన్నారు వారంతా ట్రంప్ తీరుతో భయాందోళనలకు గురవుతున్నారు" అమెరికా దక్షిణ సరిహద్దుల్లో గోడలు కట్టి అక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారుల్ని నిరోధిస్తామని, ముస్లింలకు ప్రవేశం వద్దని ట్రంప్ చెబుతున్న మాటలపైనా ఆమె మండి పడ్డారు.

ట్రంప్ తన మాటలతో.. మహిళలు, మెక్సికన్లు, ముస్లింలు.. తదితరుల్ని కించపరుస్తున్నారన్నారు. ప్రజల్ని అమెరికాకు బయటే ఉంచేందుకు తాము గోడలు నిర్మించము అని చెప్పారు . ఎందుకంటే అలా వలస వచ్చిన ప్రజల వల్లే అమెరికా గొప్ప దేశంగా వర్థిల్లుతోందన్న విషయం తమకు బాగా తెలుసునన్నారు. అలాంటి భయాలు ప్రజల్లో కల్పించడం మంచిదికాదని సూచించారు.
సపోర్ట్ చెస్థెయ్ షేర్ చేయండి
No comments:
Post a Comment