టికెట్ లేకుండా ప్రయాణిస్తోన్న ఓ మహిళపై అత్యాచారం చేశాడో ట్రేన్ టికెట్ ఎగ్జామినర్.
జైపూర్ వెళుతున్న హజ్రత్ ఎక్స్ ప్రెస్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బరేలీ అలాకు చెందిన ప్రయాణీకురాలు టీటీఈ రవి మీనాపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయట పడింది. గత నెల 29న తల్లితో గొడవ పడి ఇంట్లో చెప్పకుండా.. జైపూర్ లోని భర్త ఇంటికి బయలు దేరింది ఆ మహిళ. డబ్బులు లేకపోవడంతో టికెట్ లేకుండా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కిందామె. చెకింగ్ కు వచ్చిన టీటీఈ నిలదీయడంతో ఆమె టికెట్ లేదంది. కొంతసేపు ఆమెను సతాయించాడు టీటీఈ. ఆ తర్వాత వేరే బోగీలోకి తీసుకొని పోయాడు. ఎవరూ లేకపోవడంతో ఆమెను రేప్ చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ జైపూర్ వెళ్లేదాకా ఎవరితోనూ ఈ విషయం చెప్పకుండా స్టేషన్ రాగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
No comments:
Post a Comment