లండన్‌కి చెందిన ‘అనాటమిక్ అండ్ కో’ అనే షూ తయారీ సంస్థ.. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కి చెందిన శాస్త్రవేత్తలు కలిసి ‘ఇన్ గుడ్ కంపెనీ’ పేరుతో స్టార్ట్ షూస్‌ను రూపొందించారు. ఈ షూలో మొబైల్‌తో అనుసంధానమై పనిచేసే బ్లూటూత్ ట్రాన్స్‌మీటర్‌ను అమర్చారు. దీని ద్వారా షూ వేసుకున్నప్పుడు మొబైల్‌లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను నిలిపివేస్తుంది.
ఎప్పుడూ ఫోన్‌లో అప్‌డేట్స్ చూసుకునే వారు ఏ పార్టీ
లకో.. ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ షూస్ ధరిస్తే.. మధ్యలో అలాంటివి చేయకుండా ఇది ఉపయోగపడుతుంది. అలాగే అనవసరమైన పుష్ నోటిఫికేషన్లు రాకుండా కూడా చేస్తుందట. ముఖ్యమైన యాప్స్ వాడాల్సి వచ్చినప్పుడు వాటికి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంచి అనవసరమైన యాప్స్‌కు నిలిపివేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడు ఇవ్వాలో.. ఎప్పుడు నిలిపివేయాలో టైం కూడా సెట్ చేసుకోవచ్చు.

No comments:
Post a Comment