9నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆప్షన్ల ఎంపిక
16న వెబ్‌సైట్‌లో తుది కేటాయింపులు
తెలంగాణ ఈసెట్ అడ్మిషన ప్రక్రియ తేదీలు ఖరారయ్యాయి. టీఎ్‌స.ఈసెట్ అడ్మిషన్ కమిటీ శుక్రవారం సమావేశమై 2016-17 సంవత్సరానికి నోటిఫికేషన విడుదలచేసింది. ఈ ఏడాది ఈసెట్‌కు మొత్తం 26,408మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కన్వీనర్ ఎంవీరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన, ఆప్షన్ల ఎంపిక ప్రక్రియలను జూన 9నుంచి చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
విద్యార్థులు తమ ఆప్షన్లను మార్చుకునేందుకు జూన్ 14న అవకాశం కల్పించారు. విద్యార్థులు తుది కేటాయింపును 16తేదీన రాత్రి 8గంటల నుంచి tsecet.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌనలోడ్‌చేసుకునేందుకు విద్యార్థులు ఐసీఆర్, హాల్‌టికెట్ నంబర్లతోపాటు పాస్‌వర్డ్, పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment