పెళ్లి ముచ్చట్లతో టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న పేర్లు సామ్.. చైతూ. సమంతా… నాగచైతన్య మూడుముళ్ల బంధంపై క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఒక్కటవ్వబోతున్నారు. సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వీరిద్దరూ నటించబోతున్నట్టు సమాచారం. నాగచైతన్య సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే సామ్.. చైతూ మూడు సినిమాల్లో నటించారు. ఏమాయ చేసావే… ఆటోనగర్ సూర్య… మనం. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీ షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది.

No comments:
Post a Comment